top of page
Writer's picturenewsmediasm

ఛాంపియన్స్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్తానం సాధించిన కొరియోగ్రాఫర్ డి. అనిల్ బాబు, విజయవాడ


తన అసమాన ప్రతిభతో , జాతీయ సమైక్తను చాటుతూ .. 600 వందల మంది మహిళలు , విద్యార్థినుల తో ఈయన రూపొందించిన జానపద నృత్య రూపకం ఛాంపియన్స్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది .




చరిత్ర సృష్టించి , ప్రపంచ రికార్డు ను కైవసం చేసుకున్న విజయ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫార్మాస్యూటికల్ ఫర్ విమెన్ కళాశాలకు చెందిన మహిళలు మరియు విద్యార్థినులు !








కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు 28 రాష్ట్రాల జానపద నృత్యాల తో భారత మాతకు నృత్య నీరాజనం

"భిన్నత్వం లో ఏకత్వం" అని హిందూ, క్రైస్తవ , ముస్లీమ్ చిహ్నాల రూపంలో మహిళలు ఒదిగిన విధానం అద్భుతం . ఐక్యమత్యములోనే దాగుంది ప్రగతి అని నినదిస్తూ ...

మువ్వన్నెల జెండా మధ్యన భారత మాత చిరునవ్వులు చిందిస్తూ, ఆశీర్వదిస్తూ ...

ఎంతటి నయన మనోహరం ...

యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవత

అంటూ స్త్రీలను గౌరవించే దేశం మన దేశం -భారత దేశం

నింగి హద్దుల దాక నిత్యము అన్న చందాన

మహిళలు , విద్యార్థినులు భారత మాత కు సరిహద్దలాగా నిలపడి ,600 మీటర్ల జాతీయా జెండా ను ఆత్మగౌరవానికి ప్రతీకగా చేతబూని శత్రుదుర్భేద్యం గా మేము ఉన్నామని , జాతీయా జెండా ను రెప ...;రెప లాడిస్తూ .చివరిలో కొసమెరుపులాగా సాగిన విధానము విహంగ వీక్షణం లో ఓ అబ్బుర దృశ్యం. వందేమాతరం అంటూ నినదించిన తీరు దేశభక్తి ని రేకెత్తించి , దేశం మనది , తేజం మనది గుర్తు చేసింది.




స్కోర్ మోర్ ఫౌండేషన్ అధినేతలు డాక్టర్ తుర్లపాటి పట్టాభి రామ్ , డాక్టర్ శాంతి దేవి ముఖ్యఅతిథిలు గా విచ్చేసి వీరికి ప్రపంచ రికార్డు సర్టిఫికెట్స్ , జ్ఞాపికలను అందచేశారు



411 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page